వెబ్ డెస్క్: దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మే 10 నుండి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. స్వామి, అమ్మవార్లు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఇందులో భాగంగా మే 10న శ్రీ కృష్ణ సమేత గోదాదేవి మూడు చుట్లు, మే 11న శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారు ఐదు చుట్లు, మే 12న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారు ఏడు చుట్లు తెప్పలపై తిరిగి కనువిందు చేయనున్నారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
