
హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు సౌదీ అరేబియా లో పర్యటించనున్నారు. ఈనెల 22-23 తేదీల్లో సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధన భద్రత, రక్షణ, మరియు ద్వైపాక్షిక సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) వంటి ప్రాజెక్టుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకొనున్నట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్.. భారత ప్రధాని మోడీని కలిసినప్పుడు సౌదీ అరేబియాలో పర్యటించాలని ఆహ్వానం పలికారు.