– 700కు పైగా ప్రాంతాలలో ప్రదర్శనలు
– ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తి పోస్తున్న ప్రజానీకం
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున గళం విప్పుతున్నారు. అనేక నగరాలలో భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం దేశ ప్రజాస్వామ్య ఆదర్శాలకు ముప్పుగా పరిణమించిందని ఆందోళనకారులు మండిపడుతున్నారు. 250 సంవత్సరాల క్రితం 1775 ఏప్రిల్ 19న ప్రారంభమైన రివల్యూషనరీ వార్‌ను గుర్తుకు తెచ్చుకుంటూ శనివారం మాసాచూసెట్స్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. మాన్‌హట్టన్‌లో కవాతు జరిపారు. శ్వేతసౌధం ముందు ర్యాలీ తీశారు. ఇవన్నీ ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం చేపట్టిన కార్యక్రమాలే. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక వివాదాస్పద పథకాలను వారంతా నిరసించారు. దేశ బహిష్కరణలను తప్పుపట్టారు. గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమానికి ట్రంప్ మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. అనేక ప్రభుత్వ విభాగాలను మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్్ఫ్రాన్సిస్కో, బోస్టన్ సహా పలు నగరాలలో ప్రజలు రోడ్ల పైకి వచ్చి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టెక్సాస్ వంటి రాష్ట్రాలలో కూడా నిరసనలు కొనసాగాయి. ట్రంప్‌ను, ఆయన విధానాలను తూర్పారపడుతూ ప్రదర్శకులు ప్లకార్డులు ధరించారు. పాలస్తీనా ప్రజలకు, క్వీర్ కమ్యూనిటీకి సంఘీభావం తెలిపారు. న్యూయార్క్‌లో పబ్లిక్ లైబ్రరీ మీదుగా సాగిన ర్యాలీ సెంట్రల్ పార్క్, ట్రంప్ టవర్ వద్దకు చేరుకుంది. ‘అమెరికాలో రాజులు లేరు’, ‘భయం వద్దు. వలసదారులను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం’ అంటూ ప్రజలు నినదించారు. హిట్లర్, ఇతర ఫాసిస్టుల కంటే ట్రంప్ తెలివిమాలినవాడని ఓ ప్రదర్శకుడు ధ్వజమెత్తాడు. టెక్సాస్ రాష్ట్రంలోని గాల్వెస్టన్ నగరంలో కూడా ప్రదర్శన జరిగింది. వయోవృద్ధులు సైతం ఉత్సాహంగా కదలి వచ్చారు. ‘ఇది నా నాలుగో నిరసన. వచ్చే ఎన్నికల వరకూ వేచి చూస్తాను. ఇప్పుడు చేసేదేమీ లేదు. ఇప్పటికే చాలా నష్టపోయాం’ అని 63 సంవత్సరాల రచయిత పాస్టీ ఒలివర్ ఆవేదన వ్యక్తపరిచారు. శాన్ఫ్రాన్సిస్కోలో ప్రదర్శకులు ‘అభిశంసిం చండి…తొలగించండి’ అంటూ ఓ బీచ్‌లో ఇసుకలో రాసి తమ నిరసన తెలిపారు. కొందరు తమ బాధను వ్యక్తపరుస్తూ అమెరికా జాతీయ పతాకాన్ని పైకి కిందికి ఊపారు. ట్రంప్ పట్ల తమ వ్యతిరేకతను తెలియజేస్తూ అమెరికాలోని అనేక ప్రాంతాలలో అన్ని వయసుల వారు, వివిధ సామాజిక నేపథ్యాలు ఉన్న వారు ప్రదర్శనల్లో భాగస్వాములయ్యారు. ట్రంప్ ప్రభుత్వం విద్యా స్వేచ్ఛను హరిస్తోందని, ఆ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని విద్యార్థులు ధ్వజమెత్తారు. ‘సిగ్గు…సిగ్గు’ అంటూ నినాదాలు చేశారు.
‘50501’ పేరుతో ఏర్పడిన ఒక గ్రూపు ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. 50 రాష్ట్రాలు…50 నిరసనలు…ఒకే ఉద్యమం ఈ గ్రూపు లక్ష్యం. దేశంలోని వివిధ ప్రాంతాలలో 400 ప్రదర్శనలు నిర్వహించాలని అనుకుంటున్నామని ఆ గ్రూపు నిర్వాహకులు తెలిపారు. అమెరికాలో ట్రంప్, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరగడం ఇది రెండోసారి. ఈ నెల ఐదవ తేదీన కూడా ఇలాంటి ప్రదర్శనలే జరిగాయి. మొత్తంమీద దేశంలో 700 చోట్ల ప్రదర్శనలు జరిగాయని తెలుస్తోంది. వాషింగ్టన్ డీసీ నుండి శాన్ఫ్రాన్సిస్కో వరకూ నిరసనలతో మార్మోగాయి. పౌర హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, అతిగా వ్యవహరిస్తోం దని, నిరంకుశ ధోరణులు ప్రబలిపోయాయని ప్రజలు దుమ్మెత్తి పోశారు. జాక్సాన్విల్లే, ఫ్లోరిడా నుండి అంచోరాగ్, అలాస్కా వరకూ ఎక్కడ చూసినా నిరసన ధ్వనులే. 2017 తర్వాత ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ జరిగిన అతి పెద్ద ఆందోళన కార్యక్రమం ఇదేనని చెబుతున్నారు. బిస్బీ, అరిజోనా వంటి చిన్న పట్టణాలలోనూ ప్రజలు తరలివచ్చి ప్రదర్శనల్లో భాగస్వాములయ్యారు. వాషింగ్టన్ డీసీలో ప్రదర్శకు లు శ్వేతసౌధం ఎదుట గుమిగూడారు. ఆ తర్వాత హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వైపు కదిలారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మేరీల్యాండ్‌కు చెందిన ఓ వ్యక్తిని ఎల్ సాల్వెడార్‌కు పంపడాన్ని వారు తప్పుపట్టారు.