
500 మందికి పైగా విదేశీయులు గుజరాత్ లో అక్రమంగా నివసిస్తున్నారని ఈ వీడియో టైటిల్ ద్వారా తెలుస్తోంది. దీన్ని క్యూ గా తీసుకుని మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం.
వందల సంఖ్యలో గుజరాత్ రాష్ట్రంలోని పలు నగరాల్లో అక్రమ వలసదారులు తిరుగుతున్నారని పలు మీడియా సంస్థలు నివేదించాయి.
గుజరాత్లో దాదాపు 450 మంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు నిర్ధారించారని, పెద్ద ఎత్తున పోలీసు దాడుల ఫలితంగా దాదాపు 6,500 మంది పత్రాలు లేని వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారని మీడియా కథనాల్లో తేలింది. అహ్మదాబాద్, సూరత్‌లలో సోదాల తర్వాత, గుజరాత్ అంతటా ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించామని, అక్రమ బంగ్లాదేశ్ వలసదారులుగా అనుమానిస్తున్న సుమారు 6,500 మందిని అదుపులోకి తీసుకున్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) వికాస్ సహాయ్ మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రస్తుతం వారి గుర్తింపులను ధ్రువీకరిస్తున్నారు.
ఇక వైరల్ వీడియోతో పోలిన పలు వీడియోలను మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో హైదరాబాద్ కు చెందినది కాదు. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది.
వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.