Folk singer Mangli: ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం రేపినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్లో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీపై పోలీసుల దాడి చేశారు. పలువురికి మందు పార్టీ ఏర్పాటు చేసిన ఫోక్ సింగర్ మంగ్లీ… కొత్త వివాదంలో చిక్కుకుంది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసింది ఫోక్ సింగర్ మంగ్లీ.
Marijuana riot at folk singer Mangli’s birthday partyఈ తరుణంలోనే రిసార్ట్పై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్బంగా విదేశీ మద్యం సీజ్ చేశారు పోలీసులు. అటు పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. ఈ పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్ కూడా వచ్చింది. దింహో చేవెళ్ల పీఎస్లో కేసు నమోదు చేసిన పోలీసులు… విచారణ చేస్తున్నారు. ఫోక్ సింగర్ మంగ్లీకి తెలియకుండా గంజాయి కొట్టారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.