
ఆదిలాబాద్ జిల్లాకేంద్రానికి వచ్చిన పాఠ్యపుస్తకాలను నిల్వ ఉంచిన గోదాంను DEO శ్రీనివాస్‌రెడ్డి గురువారం తనిఖీ చేశారు. జిల్లాకు ఎన్ని పుస్తకాలు కావాలి.. మనకు ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయో.. పాఠ్య పుస్తకాల మేనేజర్ సత్యనారాయణను అడిగి తెలుసుకొని ఆరా తీశారు. గోదాంలో నిల్వ ఉంచిన పుస్తకాల కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. డీఈఓ వెంట సీసీ రాజేశ్వర్ ఉన్నారు.