
బండి సంజయ్ చొరవతో నలుగురికి విముక్తి
హైదరాబాద్: బ్యాంకాక్ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి మయన్మార్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గు రవుతున్న తెలంగాణకు చెందిన యువతకు విముక్తి లభించిం ది. వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా, మరొ కరు ఏపీకి చెందిన వ్యక్తి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యే క చొరవ తీసుకుని వీరిని స్వదేశానికి రప్పించారు. ఇదే విష యంపై రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడకు చెందిన మయన్మార్ బాధితుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ “మా ఏరియాలో ఉండే యశ్ నాథ్ గౌడ్ అనే వ్యక్తి బ్యాంకాక్‌లో మం చి ఉద్యోగం ఉందని ఆశ చూపడంతో నిజమేనని నమ్మామని తె లిపారు. జగిత్యాలలోని ఏజెంట్ వంశీక్రిష్ణ వద్దకు తీసుకుపో యిండు. వంశీక్రిష్ణ నన్ను ఇంటర్వ్యూ చేసిండు. బ్యాంకాక్క 200 కి.మీల దూరంలోనే జాబ్ అని చెప్పి తీసుకుపోయారు. తీరా అక్కడికిపోతే రోజుకు 16 గంటల పని అప్పగించారు. ఆ పని ఏందంటే సైబర్ క్రైమ్. ఆ పని చేయకపోతే భోజనం కూడా పెట్టకపోయేవాళ్లు. 5 నెలలు ఆ కంపెనీలో పనిచేసిన. అట్లాంటి పనిచేయడం నాకిష్టం లేక మొండికేసిన. దీంతో అక్కడున్న చై నీస్ వాళ్లు నా పాస్ పోర్టు గుంజుకున్నరు. అన్నం కూడా పెట్ట కుండా హింసించారు. అయినా వినకపోవడంతో వాళ్లు అక్క డున్న ఆర్మీ వాళ్లకు చెప్పి మేం దొంగతనంగా ఆ దేశానికి వచ్చా మని చెప్పి ఆర్మీ వాళ్లకు పట్టించారు. వాళ్లు మమ్ముల్ని జైల్లో వేశారు”అని వాపోయారు. “మా నాన్న యాదిరెడ్డి బండి సంజ య్ సార్ కు లెటర్ రాసిన వెంటనే స్పందించి విదేశాంగ శాఖ కు లేఖ రాయడంతోపాటు వెంటనే మమ్ముల్ని స్వదేశానికి ర ప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. బండి సంజ య్ సార్‌కు మా కుటుంబమంతా రుణపడి ఉంటది” అని పే ర్కొన్నారు. రాకేశ్ రెడ్డితోపాటు కోహెడకు చెందిన ఏ.శివశం కర్, కరీంనగర్ జిల్లాకు చెందిన కనూరి గణేశ్ తోపాటు ఎపికి చెందిన ఆకుల గురుయువకిశోర్ బ్రోకర్ల బారిన పడి మ య న్మార్ లో సైబర్ క్రైం వెట్టి చాకిరి చేస్తూ తీవ్రమైన హింసలకు గు రయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మా ట్లాడుతూ మ యన్మార్ లో పలువురు తెలుగు రాష్ట్రాల యువత తో పాటు వం దలాది మంది భారతీయులు సైబర్ క్రైమ్ వెట్టి చాకిరి చేస్తున్న ట్లు తమకు సమాచారం ఉందని, త్వరలోనే వా రందరినీ స్వ దేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.