జమ్మూకశ్మీర్ : ఇప్పుడిప్పుడే శాంతియుత వాయువులు పీల్చు కుంటున్న జమ్మూకశ్మీర్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఘటన వారికి ఒక్కసారిగా ఉల్లికిపడేలా చేసింది. ఈ దారుణమైన ఘటన భారతదేశంతో పాటు యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురించేంది. ఉగ్రవాదులు జరిపిన నరమేధానికి ఏకంగా 27 మందికి పైగా మృతి చెందడంతో పాటు పదుల సంఖ్యలో టూరి స్టులు గాయపడ్డారు. అంతసేపు ప్రశాంతంగా వున్న ప్రదేశం అంతా కూడా ఉగ్రవాదులు తూపాకుల మోతతో హోరెత్తింది. ఒక్కసారిగా కాల్పుల వర్షం కురిపించిన ఉగ్రవాదులను తప్పిం చుకునే ప్రయత్నంలో టూరిస్టులు పరుగులు పెట్టారు. కాని ఉగ్ర వాదులు జరిపిన విచక్షణ రహిత కాల్పుల కారణంగా సంఘటన స్థలంలో పరిస్థితులు భయానకంగా మారిపోయ్యాయి. అయితే ట్రెక్కింగ్ వెళ్లిన టూరిస్టులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. ఈ దాడి వెనుక లష్కర్ ఉగ్రవాదులు హస్తమున్నట్టు అనుమాని స్తుండగా ఈ ఉగ్రదాడికి కారణం తామే అంటూ టీఆర్ఎఫ్ ప్రక టించింది. బైసరీన్ వ్యాలీని చూసేందుకు వచ్చిన సందర్శకులను టెర్రరిస్టులు టార్గెట్ చేశారు. కాల్పులు జరిగిన సమయంలో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు తెలు స్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒడిశాకు చెందిన పర్యాటకులకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతం మొత్తం కూంబింగ్ ప్రారంభించాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్‌కు వచ్చే పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
20ఏళ్ళ తరువాత భారీ దాడి…..
గడిచిన 20ఏళ్ళలో జమ్మూకశ్మీర్‌లో ఇంతటి భారీస్థాయిలో దాడి జరగడం ఇదే మొదటిసారి. జమ్మూకశ్మీర్ లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్ పహల్గామ్లో పర్యాటకులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పల్లో పదుల సంఖ్యలో టూరి స్టులు గాయపడగా వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇప్పటికే పలువురు మృత్యువాత పడగా మరింత కొంతమంది పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమా చారం. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి భారీ గా భద్రతా బలగాలు చేరుకుని కాల్పులు జరిపిన ఉగ్రవాదులు కోసం ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. పహల్గామ్లో అమర్నాథ్ యాత్రికుల బేస్ క్యాంప్ ఉండడంతో ఇప్పటికే అమర్నాథాయాత్ర కోసంరిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. ఇదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం తీవ్రకలకలం రేపింది. ఉగ్రవాదులకాల్పుల్లో గాయపడ్డ ఓమహిళా టూరిస్ట్ సమాచారం ఇవ్వడంతో కాల్పుల ఘటన గురించి అధికా రులకు సమాచారం అందింది. ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాట కులతో పాటు స్థానికులకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. దాడి వెనుక వున్న వారిని వదిలే ప్రసక్తే లేదు :: ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు వెళ్ళిన ఉన్న ప్రధాని మోదీకి విషయం తెలిసిన వెంటనే హెూంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరాల పై అరాతీశారు. దాడి వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి దుష్ట అజెండా ఎప్పటికీ విజయవంతం కాదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పం అచంచలమైనదని, ఇలాంటి దాడుల వల్ల అది మరింత బల పడుతుందని పేర్కొన్నారు. అమితాను పహల్గామ్కు వెళ్లి సహా యక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్యాట కులపై దాడి ఘటన తీవ్రంగా బాధించిందని కేంద్ర హెూం మంత్రి అమిత్ షా అన్నారు. దాడికి పాల్పడిన వారిని వదిలి పెట్టబోమని అన్నారు. నేరస్థులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఘటన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించానని, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం అమిత్ షా శ్రీనగర్‌కు బయలుదేరి వెళ్ళారు. అలాగే ఉగ్రదాడి ఘటనపై హోంశాఖ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. పహల్గామ్ లో పర్యాట కులపై జరిగిన ఉగ్రవాద దాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. దాడికి పాల్పడినవారు… జంతువులు క్రూరులు… ధిక్కారానికి అర్హులు అంటూ పేర్కొన్నారు. ఖండించడానికి కూడా మాటలు సరిపోవంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
