కెనడాలోని వాంకోవర్ నగరంలో స్ట్రీట్ ఫెస్టివల్పైకి ఓ వాహనం బీభత్సవం సృష్టించింది. శనివారం రాత్రి ఈస్ట్ 41వ అవెన్యూ, ఫ్రెజర్ స్ట్రీట్‌లో లాపులాపు డే బ్లాక్ పార్టీ ఫెస్టివల్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న వారిపైకి ఓ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా..కొంతమంతి చనిపోయినట్లు స్థానిక పోలీసులు ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే ఎంత మంది చనిపోయారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.
