
ఆపరేషన్ సింధూర్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ దాడులు పూర్తిగా విజయవంతమయ్యాయని పేర్కొంది. భారత్ లోని ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. పాక్‌లోని కీలక వైమానిక స్థావరాలపై దాడులు చేశామన్న కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు కూడా ఉన్నాయని చెప్పింది. భారత్ జరిపిన దాడుల్లో తొమ్మిది కీలక ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని చెప్పింది.
వంద మందికి పైగా…
వందమందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరోసారి దాడికి దిగితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాలని, పాకిస్తాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. భారత్ లో అనేక ఆస్తులకు నష్టం వాటిల్లినట్లు జరిగినదాంట్లో వాస్తవం లేదని, అసత్య ప్రచారాలు చేస్తూ పాక్ తో పాటు కొన్ని సంస్థలు పక్కదోవపట్టిస్తున్నాయని తెలిపింది.