
కేటీఆర్ ఆదేశాలతోనే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు »
మీడియాతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ గత పదేళ్లలో కూడబెట్టిన అవినీతి సొమ్ముతో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణకుమార్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ ఆదేశాలతోనే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి… కాంట్రాక్టర్లు, బిల్డర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరుకుంటున్నారనే వ్యాఖ్యలు చేశారన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో చామల మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల మాటున రాష్ట్రాన్ని దోచుకుని, ఆ డబ్బులను కేటీఆర్. కొందరు కాంట్రాక్టర్లు, బిల్డర్ల దగ్గర దాచారని ఆరోపించారు. ఆ బినామీల దగ్గరున్న డబ్బుతోనే ప్రభుత్వాన్ని కూలుస్తామని ప్రభాకర్ రెడ్డి అంటున్నారని తెలి పారు. గత ప్రభుత్వ హయాంలో సీఎస్ సోమేశ్ కుమార్ను కోర్టులు అనేకసార్లు హెచ్చరించాయని చామల గుర్తు చేశారు. కేటీఆర్ నేతృత్వంలోని సోషల్ మీడియా కంచ గచ్చిబౌలి భూము లపై ఏఐతో కూడిన కల్పిత చిత్రాలతో అసత్య ప్రచారం చేసింద న్నారు. ఏఐ ఫొటోలు, వీడియోలను కిషన్ రెడ్డి అధికారిక సామా జిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేశారని, తర్వాత డిలీట్ చేశారని ఆయన గుర్తు చేశారు. ఫేక్ వీడియో కాకుంటే ఎందుకు డిలీట్ చేశారో చెప్పాలన్నారు.