
గుజరాత్ లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతుంది. ఇవాళ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న మంత్రి నారాయణ,అధికారులకు గుజరాత్ రాష్ట్ర ప్రోటోకాల్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అహ్మదాబాద్ నుంచి ఏక్తా నగర్ కు బస్సులో ప్రయాణించిన మంత్రి నారాయణ బృందంఏక్తా నగర్ లో సర్దార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ,అధికారులుపటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికత,మెటీరియల్,ఇతర అంశాలను అధికారులు వివరించారు.
గుజరాత్ లో పర్యటిస్తూ…
పటేల్ విగ్రహం చుట్టుపక్కల నిర్మించిన ఇతర నిర్మాణాలు కూడా పరిశీలన చేసిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణంలో భాగంగా అధికారులతో కలిసి గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం పటేల్ విగ్రహ నిర్మాణాన్ని అధ్యయనం చేసిన మంత్రి నారాయణ,సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి,గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు పర్యటన చేసి దానిపై చంద్రబాబు నాయుడుకు పూర్తిస్థాయి నివేదికను అందించనున్నారు.