
సింహాచలంలో జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. చందనోత్సవానికి ఆరు రోజుల ముందు గోడ కట్టారన్న జగన్ హడావిడిగా నిర్మించారన్నారు. కనీసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ముందుగా అంచనా వేసినా తగినముందస్తు చర్యలు తీసుకోలేదని జగన్ ఫైర్ అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఎన్ని ప్రమాదాలు జరిగాయో అందరూ చూస్తున్నారు కదా? అని జగన్ ప్రశ్నించారు. సింహాచలం ప్రమాదంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
వరస ప్రమాదాలు జరుగుతున్నా…
ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారని అందులో నలుగురు ఒకే కుటుంబంలో ఉన్నారని తెలిపారు. తిరుపతి తొక్కిసలాట జరిగినప్పుడు, ఇప్పుడు కూడా విచారణ కమిటీ పేరుతో చంద్రబాబు మ..మ అనిపించడం తప్ప అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేది లేదనితెలిపారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినా ఇంత నిర్లక్ష్యం ఎందుకని, దీనివల్ల చనిపోయిన కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని జగన్ ప్రశ్నించారు. ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాలని జగన్ డిమాండ్ చేశారు.