
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. కాకినాడ జిల్లా పిఠాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం వైసీపీ స్థానిక ప్రజా ప్రతినిధులతో జగన్ నేడు భేటీ కానున్నారు.
వరస సమావేశాల అనంతరం…
కార్యాలయంలో వరసగా సమావేశాలు అవుతారని ఈ మేరకు వారికి ప్రత్యేకంగా రావాలంటూ ఆహ్వానం పంపారు. ఈ సమావేశానికి వైసీపీ ముఖ్యనేతలతో పాటు ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ ఛైర్మన్లు, మున్సిపల్ వైస్ ఛైర్మన్లు కూడా పాల్గొంటారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశం ముగిసిన తర్వాత జగన్ ాయంత్రం 5.40 గంటలకు గన్నవరం విమానాశ్రాయానికి వెళ్లి అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరి వెళతారు.