
సింహాచలం చందనోత్సవంలో భక్తుల మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా మూడు వందల రూపాయల టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.
గాయపడిన వారికి…
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.