
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. నిన్న బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్న జగన్ నేడు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులతో సమావేశం కానున్నారు. ఉదయం పదిన్నర గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పార్టీ పార్టీ పార్లమెంటు పరిశీలకులతో జగన్ సమావేశమవుతారు.
భవిష్యత్ కార్యాచరణపై…
ఈ సమావేశంలో రిజనల్ కో ఆర్డినేటర్లు కూడా హాజరు కావాలని ఇప్పటికే ఆదేశించారు. పార్టీ బలోపేతంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. దీంతో పాటు అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అరకొర సాయం చేస్తుందని, దీనిపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని పిలుపునివ్వనున్నారు. దీంతో పాటు హామీల అమలుపై కూడా ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణను రూపొందించుకోవాలని చెప్పనున్నారు.