
వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో మరో షాక్ తగిలింది. వైసీపీకి మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ చంద్ర రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జగన్ కు పంపుతున్నట్లు చంద్ర ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై వ్యతిరేకతతోనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీతో పాటు మున్సిపల్ ఛైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు.
పార్టీతో పాటు ఛైర్మన్ పదవికి…
అయితే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చంద్ర రాజీనామా చేశారని అంటున్నారు. తనను కూటమి ప్రభుత్వం ఛైర్మన్ పోస్టు నుంచి దించుతుందని భావించిన చంద్ర ముందుగానే రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు మైదుకూరు పట్టణ ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు చంద్ర మాత్రం త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.