
చార్మినార్ వద్ద ప్రపంచ అందాల సుందరీమణులు సందడి చేశారు. ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద చేరుకున్న 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అక్కడ పరేడ్ ను నిర్వహించారు. అక్కడకు చేరుకున్న వారికి తెలంగాణ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. మార్ఫా వాయిద్యాలతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు స్వాగతం స్థానికులు స్వాగతం పలికారు. చార్మినార్ ఎదుట పొటోలకు పోజులిచ్చారు.
షొటో సెషన్ తో…
చార్మినార్ అందాలను, చుట్టుపక్కల ప్రాంతాలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. చార్మినార్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజిపై నుంచి గ్రూప్ ఫోటో దిగిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తర్వాత అరబ్బీ మర్ఫా వాయిద్యాలకు అనుగుణంగా స్టెప్పులేశారు. ఫోటో సెషన్ తర్వాత చార్మినార్ లోపలికి వెళ్లి సందర్శించారు. అనంతరం లాడ్ బజార్ లో ఎంపిక చేసిన కొన్ని షాపుల్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు షాపింగ్ చేశారు. ముత్యాలు, గాజులను ఆసక్తికరంగా పరిశీలిస్తూ వాటి వివరాలు తెలుసుకుంటూ కొనుగోలు చేశారు. స్థానిక వ్యాపారులతో ముచ్చటించి వారు అమ్మే వస్తువుల వివరాలను మిస్ వరల్డ్ సుందరిమణులు తెలుసుకున్నారు.