
భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడులపైనే లక్ష్యంగా దాడులకు దిగింది. మొత్తం పాకిస్థాన్ లోని తొమ్మిది చోట్ల భారత్ మిస్సైల్స్ తో దాడులకు దిగింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడానికి ఒక కారణముందని చెబుతున్నారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రదాడులు జరిపి అమాయకుల ప్రాణాలను తీశారు.
నుదుట సింధూరం చెరిపేసిన…
అయితేఇందులో ఆరు రోజుల క్రితం వివాహమైన నవ వధూవరులు వినయ్ నర్వాల్, హిమాన్షి కూడా ఉన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో తమ భర్తను కోల్పోయిన మహిళల ప్రతీకారాన్ని తెలియచేసే విధంగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారని అంటున్నారు. దీంతో పాటు యుద్ధానికి వెళ్లే సైనికులకు దిద్దే వీర తిలకం అంటే దానిని కూడా సింధూర్ అని అంటారు. అందుకే ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారంటున్నారు. భారత్ దాడులకు దిగింది కేవలం ఉగ్రవాదుల స్థావరాలపైనే అని జనావాసాలపైన కాదని భారత్ స్పష్టం చేసింది.