
మతపరమైన కారణాలు
నమ్మకాల ప్రకారం, పితృ పక్ష సమయంలో జుట్టు, గడ్డం కత్తిరించకూడదనే సంప్రదాయ మతపరమైన ఆధారం పూర్వీకుల పట్ల గౌరవం, భక్తితో ముడిపడి ఉంది. పితృ పక్షాన్ని శోక కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు తమ పూర్వీకుల జ్ఞాపకార్థం శారీరకంగా, మానసికంగా సంయమనంతో ఉంటారు. ఈ సంతాప సమయంలో జుట్టు, గడ్డం కత్తిరించుకోవడం అశుభకరమైన చర్యగా పరిగణిస్తారు. ఎందుకంటే దీనిని పూర్వీకుల పట్ల అగౌరవంగా భావిస్తారు. ఈ కాలంలో, సంయమనం, ధ్యానం, త్యాగాలకు ప్రాధాన్యత ఇస్తారు. జుట్టు, గడ్డం కత్తిరించకుండా ఉండటం పూర్వీకుల పట్ల గౌరవం, భక్తికి చిహ్నం.
ఈ సంప్రదాయానికి శాస్త్రీయ ఆధారం కూడా ఉంది. ఎందుకంటే వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభం కానున్నప్పుడు పితృ పక్షం వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు షేవింగ్ చేసుకున్నా లేదా మీ జుట్టును కత్తిరించుకున్నా, జలుబు కారణంగా మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఎందుకంటే జుట్టు సహజంగా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. కాబట్టి, శాస్త్రీయ దృక్కోణం నుంచి కూడా, పితృ పక్ష సమయంలో జుట్టు లేదా గడ్డం కత్తిరించకపోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అందుకే జుట్టు, గడ్డం కత్తిరించవద్దు అంటారు పెద్దలు.
గడ్డం ఉంటే మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ గడ్డం అతినీల లోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. చర్మం కందిపోకుండా కాపాడుకోవచ్చు. గడ్డం లేని వారితో పోలిస్తే గడ్డం ఉన్న వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు నిపుణులు. గాలిలో ఉండే దుమ్మూ, ధూళి కణాలు ముక్కులోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది ఈ గడ్డం. గడ్డం ఉన్న చోట చర్మం నుంచి సహజసిద్ధమైన నూనెల ఉత్పత్తి కూడా తేమగానే ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ గడ్డం పెంచడం మాత్రం చాలా కష్టం. కానీ దీనికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయండోయ్. మీరు గడ్డం రావడం లేదని చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే? ఈ టిప్స్ పాటించేయండి.