
గ్రామాల్లో తాటి చెట్లపై ఏప్రిల్ మే నెలలో తాటి ముంజలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కల్లుగీత కార్మికులను అడిగితే వీటిని కోసి ఇస్తారు. కొందరు ఉచితంగా ఇచ్చిన మరికొందరు డబ్బులకు కూడా విక్రయిస్తూ ఉంటారు. అయితే గ్రామాలకు వెళ్లినప్పుడు తాటి ముంజలను తీసుకొని అక్కడే కాయలో ఉన్న ముంజలను తీసుకొని తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇవి నాచురల్ గా లభిస్తాయి. కాబట్టి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వీటిని తీసుకోవడం మంచిది. పట్టణాల్లో ఉండేవారు సైతం వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. కొందరు వ్యాపారులు గ్రామాల నుంచి తీసుకువచ్చి వీటిని విక్రయిస్తూ ఉంటారు.
తాటి ముంజలు మిగతా పండ్ల వల్లే రుచిగా లేకపోయినా ఇవి తింటే ఎన్నో రకాలుగా ఆరోగ్యం అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి12 ఉంటాయి. వీటిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. అసిడిటీ సమస్య ఉన్నవారు తాటి ముంజలు తినడం వల్ల ఉపశమనం పొందుతారు. శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నవారు కూడా తాటి ముంజలు తినడం వల్ల సమస్య నుంచి పరిష్కారం పొందవచ్చు.
అయితే తాటి ముంజలను మిగతావారు ఎవరైనా తీసుకోవచ్చు. ఇందులో షుగర్ కంటెంట్ తక్కువగా ఉన్నప్పటికీ మధుమేహం వ్యాధి ఉన్నవారు మాత్రం తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఇవి ఎక్కువగా కావడంతో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని కొనుగోలు చేసుకుని తినాలి. అయితే వేసవిలో తక్షణ తక్షణ శక్తిని అందించడానికి తాటి ముంజలే ప్రధానంగా ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగతాకాలంలో ఇవి లభించవు. వేసవిలోనూ ఏప్రిల్ మే నెలలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఆ తర్వాత వీటిని ఎక్కడా విక్రయించారు. అందువల్ల అందుబాటులో ఉన్న సమయంలో మాత్రమే వీటిని తినడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
తాటి ముంజలకు పెద్దగా ధర కూడా ఎక్కువగా ఉండదు. మిగతా పండ్ల కంటే తక్కువ ధరలోనే విక్రయిస్తూ ఉంటారు. అందువల్ల వైసవిలో తాటి ముంజలను కచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.