
ఇంటిలో ప్రధానమైనది హాలు గది. మిగతా రూముల్లో కంటే ఈ గదిలోనే ఎక్కువగా గడుపుతారు. అయితే ఈ గది ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఈ గది ప్రశాంతంగా ఉండాలంటే ఈ గదిలో ఉండే గోడలకు అనువైన రంగులు వేయాలి. హాలులో ఎక్కువగా లేత పసుపు, నేత గులాబీ రంగు, లేత నారింజ రంగు వంటి వి వేసుకోవాలి. అయితే ఈ హాలు పెద్దదిగా ఉంటే ఇతర రంగులను ఎంచుకోవచ్చు. వీటిలో నేవీ బ్లూ, మ్యాట్ బ్లాక్, గ్రే వంటి కలర్లు పెద్ద గదులకు బాగుంటాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.
ఒక ఇంట్లో పూజ గదిని ప్రత్యేకంగా నిర్మించుకుంటే.. ఇందులో లేత పసుపు రంగు ఉండేలా చూసుకోవాలి. అలాగే గులాబీ రంగులు వేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ప్రతి ఇంట్లో వంటగది కూడా చాలా ప్రధానమైనదే. మహిళలు ఎక్కువగా ఈ గదిలోనే ఉంటారు. మీరు ఎప్పుడూ వంట చేస్తూ ఉండటం వల్ల చికాకుతో ఉండగలుగుతారు. అయితే వారి మనసుకు హాయిని ఇచ్చే రంగును ఈ గది గోడకు వేసుకోవాలి. వంటగది గోడకు నారింజ, పసుపు, తెలుపు వంటి రంగులు వేసుకోవడం ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు.
ఇక పడక గదిలో ఎలాంటి రంగులు గోడలు ఉండాలని చాలామందికి సందేహం ఉంటుంది. ఈగది కూడా ప్రశాంతతను ఎక్కువగా కోరుకుంటారు. ఎందుకంటే రాత్రి సమయంలో సరైన నిద్ర పట్టాలంటే ప్రశాంతమైన వాతావరణ ఉండాలి. అలాగే ఇదే సమయంలో కంటికి ఇంపుగా ఉండే రంగుల గల గోడలు ఉండాలి. ఈ గదిలోని గోడలకు ఆకుపచ్చ, నీలం, లేత గులాబీ కలర్లు వేసుకోవాలని చెబుతున్నారు. ఈ రంగుల వల్ల ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు.
అయితే ఇవి కొందరు నిపుణులు చెబుతున్న ప్రకారం మాత్రమే. చాలామంది తమకు ఇష్టమైన రంగులను వేసుకోవడం ద్వారా వారు ప్రశాంతంగా ఉంటారు. అలాగే కొన్ని కారణాల వల్ల లేదా వాస్తు ప్రకారం గా కూడా రంగులను మార్చుకోవచ్చు. అయితే బయటకు కనిపించే గోడలు మాత్రం ఆకర్షించే విధంగా మైన రంగులు ఉండాలి. అలాగే ప్రధాన గదిలో ప్రశాంతమైన వాతావరణమిచ్చే రంగును వేసుకోవాలి. ప్రత్యేకమైన పడకగది ఉంటే వారికి ఇష్టమైన రంగులు వేసుకోవడం ద్వారా ప్రశాంతంగా ఉంటుంది.