Viswambhara Movie : మెగాస్టార్ చిరంజీవి(Megatsar Chiranjeevi) కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర'(Viswambhara Movie). వశిష్ఠ(Vasistha Malladi) దర్శకత్వం లో, ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి(MM Keeravani) సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అప్పట్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉండేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ గత ఏడాది విడుదల చేసిన టీజర్ లో గ్రాఫిక్స్ ని చూసి చిరంజీవి ని ద్వేషించే దురాభిమానులు మాత్రమే కాదు, ఆరాధించే అభిమానులు కూడా బండబూతులు తిట్టారు. భారీ గ్రాఫిక్స్ అన్నారు, తీరా చూస్తే అమీర్ పేట్ గ్రాఫిక్స్ తో సినిమాని చుట్టేస్తున్నట్టు ఉన్నారు. ఇలా అయితే కష్టమే అన్ని అభిమానులు సైతం మండిపడ్డారు. ఆడియన్స్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని తీసుకున్న మూవీ టీం, VFX టీం మొత్తాన్ని మార్చేసి, మళ్ళీ కొత్తగా రీ వర్క్ చేయించారు. ఇప్పుడు గ్రాఫిక్స్ అద్భుతంగా వచ్చాయని తెలుస్తుంది.
డైరెక్టర్ వశిష్ఠ తండ్రి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘టీజర్ లో మీరు చూసిన గ్రాఫిక్స్ కేవలం AI ద్వారా జెనెరేట్ చేయబడింది. అప్పటికీ VFX వర్క్ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు పూర్తి అయ్యింది, కంటెంట్ అదిరిపోయింది, త్వరలోనే సరికొత్త టీజర్ ని విడుదల చేయబోతున్నాము. అప్పుడు మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి కేవలం గ్రాఫిక్స్ కోసమే 75 కోట్ల రూపాయిల ఖర్చు చేశారట. ఈ స్థాయిలో రాజమౌళి లాంటి డైరెక్టర్ మాత్రమే ఖర్చు చేసారని, ఒక కొత్త కుర్రాడు VFX కోసం ఇంత ఖర్చు చేయడం ఇదే తొలిసారి అని అంటున్నారు. కేవలం గ్రాఫిక్స్ కోసమే ఇంత ఖర్చు చేసారంటే సినిమా ఏ రేంజ్ లో ఉండి ఉంటుందో మీరే ఊహించుకోండి.
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష కృష్ణన్ నటిస్తుండగా, కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇకపోతే రీసెంట్ గా హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన ‘రామ రామ’ పాట బాగా క్లిక్ అయ్యింది. అభిమానులలో ఉన్న నెగటివ్ అంచనాలను ఈ పాట కాస్త పాజిటివ్ చేసింది. జులై , లేదా ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. మెగా అభిమానులకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తప్పనిసరి. ఎందుకంటే ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘గేమ్ చేంజర్’ చిత్రం తీవ్రంగా నిరాశపర్చింది.
