మరో 770 కావాలి
వన్డే, టి20 ఫార్మాట్ పక్కన పెడితే.. టెస్టులలో భారత జట్టు తరఫున పదివేల పరుగులు సాధించిన ఆటగాళ్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఈ ఘనతను ముందుగా సునీల్ గవాస్కర్ బద్దలు కొట్టాడు. ఆ తర్వాత సచిన్ ఆ రికార్డును చేదించాడు. అనంతరం రాహుల్ ద్రావిడ్ ఆ ఘనతను అందుకున్నాడు. ఈ రికార్డును అందుకోవాలంటే విరాట్ కోహ్లీకి మరో 770 రన్స్ అవసరం ఉన్నాయి. టెస్ట్ ఫార్మాట్లో.. ఇలాంటి రికార్డు దక్కించుకునే అవకాశం ముందున్నప్పటికీ.. రిటైర్మెంట్ అనడం కరెక్ట్ కాదని బీసీసీఐ పెద్దలు విరాట్ కోహ్లీతో చెప్పారట.. సుదీర్ఘ ఫార్మాట్లో ఒకేసారి రోహిత్, కోహ్లీ గనక శాశ్వతంగా దూరం జరిగితే అది జట్టుపై ఎఫెక్ట్ చూపిస్తుందని.. యంగ్ టీం కు సపోర్ట్ ఇవ్వాలని.. అవసరమైతే మైదానంలో కీ రోల్ ప్లే చేయాలని విరాట్ కోహ్లీకి బీసీసీఐ మేనేజ్మెంట్ సూచించిందట. అయితే విరాట్ కోహ్లీ నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదని ప్రచారం జరుగుతుంది.. ఒకవేళ విరాట్ కోహ్లీ శాశ్వత వీడ్కోలు పలికితే.. ఆ ప్రభావం జట్టు మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే 2007 తర్వాత ఇంతవరకు ఇంగ్లాండ్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలుచుకోలేదు. విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాడు లేకుండా టీమిండియా ఆ ఘనత అందుకుంటుందా.. బౌన్సీ మైదానాలపై టీమిండియా యువ ఆటగాళ్లు ఒత్తిడి తట్టుకుంటారా.. అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. కెప్టెన్సీ ఇవ్వనంత మాత్రాన విరాట్ కోహ్లీ శాశ్వత వీడ్కోలు పలుకుతాడా? వద్దనుకున్న కెప్టెన్సీని అతడు ఎందుకు కావాలి అనుకుంటాడు? ఈ ప్రశ్నలకు కూడా సమాధానం లభించాల్సి ఉంది. మొత్తంగా చూస్తే ఈ రూమర్లకు చెక్ పడాలంటే విరాట్ కోహ్లీ నోరు విప్పాలి.. బీసీసీఐ పెద్దలు క్లారిటీ ఇవ్వాలి.
