
టెస్ట్ కెరియర్ ఎలా సాగిందంటే
విరాట్ కోహ్లీ టెస్ట్ కెరియర్ లో 123 మ్యాచ్లో ఆడాడు. 14 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఫార్మాట్లో పాలుపంచుకున్నాడు. మొత్తంగా అతడు 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక గత ఏడాది టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలికాడు. ఇకపై వన్డేలు, టెస్టులలో మాత్రమే ఆడతానని ప్రకటించాడు. కానీ ఏడాది కూడా గడవకముందే విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలకడం విశేషం.. అయితే గత బిజిటీలో విరాట్ ఆశించినంత స్థాయిలో ప్రదర్శన చూప లేకపోయాడు. హాఫ్ సైడ్ వెళ్లే బంతులను వేటాడి.. 8 సార్లు అలానే అవుట్ అయ్యాడు. అప్పట్లోనే విరాట్ కోహ్లీ ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అతడు శాశ్వత వీడ్కోలు పలకాలని.. డిమాండ్లు వ్యక్తం అయ్యాయి. చివరికి విరాట్ కోహ్లీ తను అనుకున్న మాట ప్రకారమే సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ఇకపై వన్డేలలో మాత్రమే విరాట్ కోహ్లీ కనిపిస్తాడు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సుదీర్ఘ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలకడం విశేషం. అతడు నిర్ణయం తీసుకున్న రోజుల వ్యవధిలోనే విరాట్ కోహ్లీ కూడా అదే దారిలో పయనించడం విశేషం. ఇక ఇటీవల తన రిటైర్మెంట్ గురించి బిసిసిఐ పెద్దలకు విరాట్ కోహ్లీ చెప్పాడు. దీనిపై వారు కాస్త సమయమనం పాటించాలని అతడికి సూచించారు. కానీ అతడు మాత్రం సైలెంట్ అయిపోయాడు. చివరికి తను అనుకున్న నిర్ణయాన్ని అమల్లో పెట్టేశాడు.. రిటర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.