
ఈ రెండు షోస్ కి ఇప్పుడు జీ తెలుగు లో మంచి రెస్పాన్స్ వస్తుంది. సూపర్ సీరియల్స్ ఛాంపియన్ ప్రోగ్రాం లో రోజా తో పాటు మంచు లక్ష్మి(Manchu Lakshmi) కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. గత వారం లో టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ చాలా ఫన్నీ గా నడిచిపోయాయి కానీ, ఈ వారం టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్స్ మాత్రం చాలా ఫైర్ మీద ఉండేట్టుగా అనిపిస్తుంది. రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమో చాలా వైరల్ అయ్యింది. ఈ ప్రోమో ఆరంభంలో సరదాగానే సాగిపోయింది కానీ, చివర్లో కాస్త ఫైర్ రాజుకుంది. కంటెస్టెంట్స్ వర్కౌట్ చేస్తున్న సమయం లో మంచు లక్ష్మి అలా ఉండకూడదు, స్ట్రెయిట్ గా ఉండాలి అని అంటుంది. ఎంత చెప్పినా కంటెస్టెంట్స్ సరిగా చేయకపోవడంతో నేరుగా స్టేజి మీదకు వచ్చి ‘అసలు మీకు ప్లాంక్ ఎలా చెయ్యాలో తెలుసా?’ అని అంటుంది.
అప్పుడు కంటెస్టెంట్ వివరణ ఇస్తుండగా ‘నేను నీతో మాట్లాడట్లేదు’ అని చాలా పొగరుగా యాటిట్యూడ్ చూపిస్తుంది. ఆ తర్వాత గొడవ ఎంత పెద్దది అయ్యిందో తెలియదు కానీ, సభకు నమస్కారం పెట్టి, షో నుండి వాకౌట్ అయ్యింది. దీనిని చూసిన రోజా ‘ఆమెకేనా కోపాలు వచ్చేది..ఆమేనా అలిగేది..మేము ఇక్కడ ఖాళీగా కూర్చున్నామా?, మాకు రాదా అలాంటివి చేయడం’ అంటూ కోపం గా మైక్ విసిరి పైకి లేస్తుంది. ఇంత పబ్లిక్ గా వీళ్ళు ఇలా కొట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదంతా ఆడియన్స్ ని ఫూల్స్ ని చేసే ప్రక్రియ అని, వాళ్లిద్దరూ కలిసి ప్రాంక్ చేసారని షో చూసినప్పుడు తెలుస్తాడని, ఇలాంటివి ఎన్ని చూసి ఉంటాము అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి వీళ్ళ మధ్య కోల్డ్ వార్ నిజంగానే జరిగిందా లేకపోతే ప్రాంకా? అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.