
ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ లో యాత్రికుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఉత్తరాఖండ్ లోని సోన్ప్రయాగ్లో జరిగిన ఈ ఘటనలో యాత్రికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో స్థానిక అధికారులు వెంటనే స్పందించి వారిని చెదరగొట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీఛార్జ్ చేశారు. అయితే యాత్రికులు కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్న వీడియో… ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Earlier, Indian pilgrims travelled to holy sites for peace and darshan but nowadays we have goons going to Kedarnath and Badrinath with rods and sticks always ready for a fight. pic.twitter.com/Szo2RLMWQV
— Uttarakhandi (@UttarakhandGo) June 19, 2025
కేదార్నాథ్ యాత్ర మార్గంలో పర్యాటకుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ యాత్రలో కీలక జంక్షన్ అయిన సోన్ప్రయాగ్లోని పార్కింగ్ ప్రాంతంలో కొందరు యాత్రికుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. దీనితో ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. సమీపంలో దొరికిన కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. దీనితో దాడులు చేసుకున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభం నుంచి తరుచూ ఇలాంటి ఘటనలు అశాంతిని కలిగిస్తున్నాయి.
కేదార్నాథ్ యాత్రకు విశేషస్పందన లభిస్తోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. స్థానిక అధికారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మే 2న ఆలయ తలుపులు తెరిచినప్పటి నుంచి 1.14 మిలియన్లకు పైగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించారు. అధికారిక లెక్కల ప్రకారం యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి స్థానిక హోటళ్లు, రెస్టారెంట్లు, పోర్టర్లు, హెలి ఆపరేటర్ల సంబంధిత సేవల వ్యాపారం రూ.300 కోట్లు దాటింది.