
Saudi Arabia fighter jets escort PM Modi’s flight: ప్రధాని నరేంద్ర మోదీ సౌది అరేబియా పర్యటనలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సౌది అరేబియా ప్రభుత్వం కొత్తగా ఆలోచించింది. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం గల్ఫ్ దేశాల గగనతలంలోకి ప్రవేశించడంతోనే సౌది ఫైటర్ జెట్స్ ఆయన విమానాన్ని ఎస్కార్ట్ చేస్తూ ఘన స్వాగతం పలికాయి.
సౌది అరేబియా సర్కారు పంపించిన F-15 ఫైటర్ జెట్స్ ప్రధాని మోదీ విమానాన్ని ఎస్కార్ట్ చేస్తున్న దృశ్యాలను భారత విదేశాంగ శాఖ విడుదల చేసింది. భారత ప్రధాని మోదీకే కాదు… ఒక దేశాధినేతకు దక్కిన అరుదైన గౌరవం ఇది. భారత ప్రధాని మోదీ పట్ల తమ గౌరవాన్ని, అభిమానాన్ని సౌది అరేబియా ఈ విధంగా చాటుకుంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.