ప్రారంభంలో టిక్ టాక్ వీడియోలు, ఇంస్టాగ్రామ్ రీల్స్ వంటివి చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఫ్యాషన్ బ్లాగర్ గా కూడా ఈమెకు బాగా గుర్తింపు ఉంది. కొన్ని ప్రకటనలలో కూడా నటించి ఈమె బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఈమె క్యూట్‌నెస్ కు ఫిదా అయిన నిర్మాతలు ఆమెకు సినిమాలలో నటించే అవకాశం ఇచ్చారు. చిన్న సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ నటించిన సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పేరు ప్రస్తుతం నెట్టింట బాగా వినిపిస్తుంది. ఏకంగా ఈ బ్యూటీ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటించే అవకాశం అందుకుంది.
ఈ అమ్మాయి మరెవరో కాదు రమ్య పసుపులేటి. రమ్య పసుపులేటి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాతో రమ్య పసుపులేటి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా పలు యాడ్స్ లో నటించి చిన్నతనంలోనే బాగా క్రేజ్ తెచ్చుకుంది. అనుష్క హీరోయిన్ గా నటించిన పంచాక్షరి సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఇక విశ్వంభర సినిమాలో రమ్య పసుపులేటి చిరంజీవి చెల్లెలిగా కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.


