
నాగార్జున, వెంకటేష్ ఈ మధ్య సాధించిన విజయాలు అన్నీ మల్టీస్టారర్సే కావడం విశేషం. అయితే సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టి ట్రేడ్ వర్గాలు నివ్వెరపోయేలా చేశాడు. అసలు యాభై కోట్లు కూడా వెంకీకి కష్టమే అనుకుంటున్న తరుణంలో ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే హీరోగా, క్లీన్ హిట్ పడితే వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో తెలియజేశాడు. 2025 సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ కెరీర్లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది.
రామ్ చరణ్, బాలకృష్ణ వంటి బడా స్టార్స్ కి షాక్ ఇస్తూ వెంకటేష్ సంక్రాంతికి విన్నర్ అయ్యాడు. వెంకటేష్ స్టామినా ఏమిటో ఇండస్ట్రీకి తెలిసొచ్చిన నేపథ్యంలో స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఓ బడా డైరెక్టర్ తో వెంకటేష్ మూవీ కన్ఫర్మ్ అయ్యిందట. ఆయనెవరో కాదు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరి కాంబోలో మూవీ అంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. త్రివిక్రమ్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అల్లు అర్జున్ తో మూవీ కోసం ఆయన వేచి చూస్తున్నాడు. అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ ని పక్కన పెట్టి అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు.
దాంతో త్రివిక్రమ్ కి భారీ గ్యాప్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే వెంకీతో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. కాగా వీరి కాంబోలో గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. సదరు చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పని చేశాడు. ఈసారి నేరుగా వెంకటేష్ ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సక్సెస్ఫుల్ కాంబో తిరిగి కలుస్తున్న నేపథ్యంలో మరో సూపర్ హిట్ వెంకటేష్ కాంబోలో పడటం ఖాయమని పరిశ్రమలో టాక్ వినిపిస్తుంది.