
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలో రాజస్థాన్ రాయల్స్ యజమాని రంజిత్ బర్ఠాకూర్ వైభవ్ సూర్యవంశీతో కలిసి నిలబడి ఉన్నాడు. ఆయన చేతిలో మెర్సిడెస్ కారు తాళాలు ఉన్నాయి. వాటిని ఆయన వైభవ్ కు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. రంజిత్ బర్ఠాకూర్ అస్సాంలోని జోర్హాట్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. అంతేకాకుండా రాయల్ మల్టీస్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కూడా.
వైభవ్ సూర్యవంశీ మంగళవారం గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు. తద్వారా టీ20 క్రికెట్లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. సూర్యవంశీ (14 సంవత్సరాల 32 రోజులు), మనీష్ పాండే (19 సంవత్సరాల 253 రోజులు), రిషబ్ పంత్ (20 సంవత్సరాల 218 రోజులు), దేవదత్ పడిక్కల్ (20 సంవత్సరాల 289 రోజులు) రికార్డులను బద్దలు కొట్టేశాడు.
ఇది టోర్నమెంట్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కూడా. క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ చేయగా అతని తర్వాత స్థానం వైభవ్ దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఒక భారతీయుడు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీ ఇదే. యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో చేసిన సెంచరీ రికార్డును వైభవ్ అధిగమించాడు.