
ఇంతకుముందు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వెంకటేష్, ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సారి ఆయనతో జతకట్టిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన తాజా సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
ప్రస్తుతం త్రివిక్రమ్ పరిస్థితిని చూస్తే, విజయాన్ని సాధించాలంటే ఏ మాత్రం పొరపాటు జరగకూడదనే స్థితిలో ఉన్నాడు. ‘గుంటూరు కారం’ సినిమా తర్వాత వచ్చిన విమర్శలతో ఆయన ఇమేజ్‌కు చెడ్డ ప్రభావం ఏర్పడింది. అందుకే ఇప్పుడు ఆయన చేయబోయే ప్రతి సినిమాపైనా పూర్తి శ్రద్ధ పెడుతున్నాడు.
‘గుంటూరు కారం’ విడుదలై రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు త్రివిక్రమ్ మరో సినిమా పట్టాలెక్కించలేదు. మంచి స్క్రిప్ట్, క్లారిటీ వచ్చిన తరువాతే కొత్త ప్రాజెక్ట్ మొదలెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకే వెంకటేష్‌తో కలిసి చేస్తున్న ఈ సినిమా పట్ల ఆయన ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో, విడుదల తేదీ ఏమిటో స్పష్టత రాలేదుగానీ… వేరే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ కాంబో మరోసారి మ్యాజిక్ చేస్తుందా? త్రివిక్రమ్‌కు తిరుగులేని హిట్ ఇస్తుందా? వెంకటేష్‌కి పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెస్తుందా? అన్నదానికీ సమాధానం రావాలంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే.