
వల్లభనేని వంశీ ఆరోగ్యం ఏ మాత్రం బాగాలేదని ఆయన బార్య పంకజశ్రీ తెలిపారు. వంశీ శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కిటోన్ శాంపిల్స్ పాజిటివ్ గావచ్చాయన్న పంకజశ్రీ బరువు కూడా బాగా తగ్గారని ఆవేదన చెందారు. వంశీ ఆరోగ్యంపై తమకు ఆందోళనగా ఉందని పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని అన్నారు.
వరస కేసులు పెడుతూ…
కాగా వంశీపై వరస కేసులు బనాయిస్తుండటంతో కేసులు పెట్టినదానిలో బయటకు రాలేకపోతున్నారని తెలిపారు. దాదాపు మూడు నెలల నుంచి వంశీ జైలులోనే ఉన్నారన్న వల్లభనేని వంశీ లాయర్ కావాలని పాత కేసులు తిరగదోడి బెయిల్ వచ్చినా బయటకు రాకుండా చేస్తున్నారని అన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే పోలీసులు ఎప్పటి కేసులో ఇప్పుడు తీసుకు వచ్చి పీటీ వారెంట్లతో అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు.