
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ లభించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురికి బెయిల్ ఇస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయి గత ఎనభై రోజుల నుంచి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో…
వల్లభనేని వంశీపై కేవలం సత్యవర్థన్ కిడ్నాప్ కేసు మాత్రమే కాకుండా అనేక కేసులు నమోదయ్యాయి. వరసగా ఒక్కొక్క కేసును పోలీసులు నమోదు చేస్తున్నారు. అయితే ప్రధానంగా సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ రావడంతో పెద్ద ఊరట కలిగిందనే చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు చెప్పింది.