
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ‘పెద్ది’ చిత్రాన్ని చేస్తున్న బుచ్చి బాబు ఈ చిత్రం ద్వారానే డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి నేడు సౌత్ లోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ అయ్యే దిశగా కెరీర్ లో అడుగులు వేస్తుంది. కానీ వైష్ణవ్ తేజ్ మాత్రం చాలా సైలెంట్ అయిపోయాడు. ‘ఉప్పెన’ చిత్రం తర్వాత ఆయన కొండపోలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ వంటి సినిమాలు చేసాడు. మూడు చిత్రాలు కూడా ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఆయన హీరో గా నటించిన ‘ఆదికేశవ’ చిత్రం 2023 వ సంవత్సరం లో విడుదలైంది. ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది, ఆ తర్వాత ఆయన ఏ చిత్రం చేయబోతున్నాడు?, అసలు సినిమాలు చేస్తాడా లేదా అనేది కూడా అనుమానమే అన్నట్టుగా తయారైంది పరిస్థితి.
వైష్ణవ్ తేజ్ మంచి పొటెన్షియల్ ఉన్న నటుడు. బాలనటుడిగా ఆయన జానీ, అందరివాడు, శంకర్ దాదా MBBS వంటి చిత్రాల్లో నటించాడు. చిన్నతనం లోనే ఈ కుర్రాడు ఎవరో బాగా చేసాడు అని ఆడియన్స్ చేత అనిపించుకున్నాడు. ఇక పెద్దయ్యాక ‘ఉప్పెన’ చిత్రం తో నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా లుక్స్ పరంగా కూడా ఇతను సాయి తేజ్ కంటే బెటర్ గా ఉన్నాడు అనే కామెంట్స్ వినిపించాయి. మంచి కథలు ఎంచుకొని ముందుకు పోతే పెద్ద రేంజ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వయస్సు కి మించిన పాత్రలు కాకుండా యూత్ ఆడియన్స్ కి దగ్గరయ్యే సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ విషయం లో ఆయన ప్రదీప్ రంగనాథన్ ని ఆదర్శంగా తీసుకోవచ్చు. చూడాలి మరి భవిష్యత్తులో ఈ మెగా హీరో అసలు సినిమాలు చేస్తాడా?, చేసినా సక్సెస్ అవ్వగలడా లేదా అనేది.