

- కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాక
- హాజరుకానున్న మంత్రులు సీతక్క, తుమ్మల
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్‌లోని ఆర్యానగర్‌లో ఏర్పాటుచేసిన జాతీయ పసుపు బోర్డు ఆఫీస్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం ప్రారంభించనున్నారు. అమిత్ షా మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఇందూరుకు చేరుకోనున్నారు. పసుపు బోర్డు ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత బస్వా గార్డెన్లో ఆఫీసర్లతో భేటీ అవుతారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పాల్గొంటారు. అనంతరం అమిత్‌షా కంఠేశ్వర్ చౌరస్తాలో ఎంపీ అర్వింద్ ధర్మపురి తండ్రి డి.శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే పసుపు రైతుల మీటింగ్‌లో ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళతారు. అమిత్‌షా రాక సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ అర్వింద్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
(function(i,s,o,g,r,a,m){i[“GoogleAnalyticsObject”]=r;i[r]=i[r]||function(){
(i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o),
m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)
})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga”);
ga(“create”, “UA-133664641-1”, “auto”);
ga(“require”, “displayfeatures”);
ga(“set”, “campaignSource”,”Facebook”);
ga(“set”, “campaignMedium”, “Social Instant Article”);
ga(“set”, “title”, “నేడు (జూన్ 29) ఇందూరులో పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభం”);
ga(“send”, “pageview”);