
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలి మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. పహల్గామ్ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్న భారత్ ఇప్పటకే పాకిస్థాన్ పై అనేక ఆంక్షలు విధించింది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
కీలక నిర్ణయాలు…
నీటిని నిలుపుదల చేయాలని నిర్ణయించింది. పాకిస్థాన్ కు మందుల సరఫరాను కూడా నిలిపేసింది. ఈరోజు జరుగుతున్న సమావేశంలో పాకిస్థాన్ పై మరికొన్ని ఆంక్షలు విధించే అవకాశముందని తెలుస్తోంది. పాక్ విమానాలకు ఎయిర్ స్పేస్ మూసివేతతో పాటు, మందుల ఎగుమతులు, కాల్పుల విరమణ ఒప్పందంపై పలు కీలక నిర్ణయాలు ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకునే అవకాశముంది.