
రాబోయే ఐక్యూబ్‌కు అప్డేట్స్ రావొచ్చు లేదా కొత్త వేరియంట్‌గా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది టీవీఎస్ ఆల్-ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తుంది. ప్రస్తుతం టీవీఎస్ ఇండియాలో ఐక్యూబ్ 5 వేరియంట్లను అమ్ముతోంది. ఏప్రిల్ 2025 అమ్మకాల ప్రకారం ఈ సెగ్మెంట్లో అమ్మకాల్లో ఇదే ముందుంది. మార్కెట్లో పెద్ద షేర్‌ను సొంతం చేసుకోవాలని టీవీఎస్ కూడా చూస్తోంది. అందుకే ఐక్యూబ్ వేరియంట్లను పెంచడం సరైన నిర్ణయం కావొచ్చు.
రిపోర్ట్స్ ప్రకారం.. ఈ అప్డేట్ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్‌పై ఆధారపడి ఉండొచ్చు. దీన్ని ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో చూపించారు. ఆ స్కూటర్‌ను బ్లూ కలర్లో డిజైన్ చేశారు. రాబోయే 2025 మోడల్ కూడా ఇదే కాన్సెప్ట్ డిజైన్‌పై బేస్ అయి ఉండొచ్చు. పవర్‌ట్రెయిన్‌లో మార్పులు రావొచ్చని భావిస్తున్నారు. దాని వల్ల రేంజ్ పెరిగే అవకాశం ఉంది. ఫీచర్ల లిస్ట్‌లో కూడా మార్పులు ఉండొచ్చు. టీవీఎస్ ఇంకా దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో అప్డేటెడ్ వెర్షన్ టెస్టింగ్, స్కూటర్ గురించి మరిన్ని వివరాలు చూడొచ్చు.
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర
టీవీఎస్ ఐక్యూబ్ వేరియంట్లలో ఐక్యూబ్ 2.2 కేడబ్ల్యూహెచ్ ధర రూ.1,12,557 నుంచి మొదలవుతుంది. ఇతర వేరియంట్లు ఐక్యూబ్ స్టాండర్డ్, ఐక్యూబ్ ఎస్ 3.4 కేడబ్ల్యూహెచ్, ఐక్యూబ్ ఎస్టీ 3.4 కేడబ్ల్యూహెచ్, ఐక్యూబ్ ఎస్టీ 5.1 కేడబ్ల్యూహెచ్ ధరలు వరుసగా రూ.1,34,363, రూ.1,45,472, రూ.1,57,063, రూ.1,71,122గా ఉన్నాయి.
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్
టీవీఎస్ ఐక్యూబ్ బేస్ మోడల్ రెండు బ్యాటరీ ఆప్షన్స్‌తో వస్తుంది. అవి 2.2kWh, 3.4kWh. ఇది 4kW మోటార్‌తో పనిచేస్తుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ టాప్ స్పీడ్ గంటకు 75 కిమీ. రేంజ్ 75 కిమీ. అదే 3.4kWh ట్రిమ్‌లో గంటకు 78 కిమీ టాప్ స్పీడ్, 100 కిమీ రేంజ్ లభిస్తుంది. చిన్న బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి రెండు గంటలు పడుతుంది. పెద్ద బ్యాటరీ ఛార్జ్ చేసేందుకు నాలుగు గంటల 30 నిమిషాలు పడుతుంది.