
దీంతో మే నెల మొదటి రెండు వారాల్లో అమ్ముడైన మొత్తం 43,342 ఎలక్ట్రిక్ టూవీలర్స్‌లో టీవీఎస్ వాటా 24 శాతానికి చేరింది. తన పాత పోటీదారు అయిన బజాజ్ ఆటో కంటే ఏకంగా 942 యూనిట్లు ముందంజలో ఉంది. టీవీఎస్ దగ్గర కావాల్సినంత ప్రొడక్షన్ కెపాసిటీ ఉండటంతో పాటు, ఐక్యూబ్ డీలర్ నెట్‌వర్క్‌ను కూడా చాలా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా దాదాపు 950 టచ్‌పాయింట్స్ ఉన్నాయని అంచనా. టీవీఎస్ ప్రతి నెల తన ఈవీ నెట్‌వర్క్‌ను దూకుడుగా పెంచుకుంటూ పోతోంది.
ఏప్రిల్‌లో మూడో స్థానంలో ఉన్న బజాజ్ కూడా ఇప్పుడు దూకుడు చూపిస్తోంది. మే మొదటి రెండు వారాల్లో 9,627 చేతక్ స్కూటర్లను అమ్మడంతో ఈ నెల ఈ-టూవీలర్ అమ్మకాల్లో 22 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. ఏప్రిల్ చివరిలో కంపెనీ కొత్త చేతక్ 3503ని రూ. 1.10 లక్షల ధరతో లాంచ్ చేసింది. కొత్త చేతక్‌లో 155 కిలోమీటర్ల రేంజ్, గంటకు 63 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఉంది.
ఏప్రిల్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మిన రెండో అతిపెద్ద కంపెనీ ఓలా ఎలక్ట్రిక్, ఈ నెలలో మాత్రం 8,322 యూనిట్లతో మూడో స్థానానికి పడిపోయింది. టీవీఎస్ కంటే 2,247 యూనిట్లు వెనుకబడి, బజాజ్ ఆటో కంటే 1,305 యూనిట్లు వెనుకబడి ఉంది. మే 1 నుంచి 14 వరకు ఓలాకు 19 శాతం మార్కెట్ షేర్ ఉంది. ఓలా తన S1 జెన్ 3 ఈ-స్కూటర్ పోర్ట్‌ఫోలియో డెలివరీని ప్రారంభించింది. దీని ధర S1 X (2kWh)కి రూ. 79,999 నుంచి S1 Pro+ (5.3kWh)కి రూ. 1,69,999 వరకు ఉంది.
ఏథర్ ఎనర్జీ 5,431 ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలతో, 13 శాతం మార్కెట్ షేర్‌తో నాలుగో స్థానంలో ఉంది. కంపెనీ ప్రస్తుతం రిజ్టా ఫ్యామిలీ స్కూటర్, 450S, 450X, 450 అపెక్స్తో సహా నాలుగు మోడళ్లను కలిగి ఉంది. ఏథర్ దేశంలో తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది.