కాకినాడ జిల్లా తుని పురపాలక సంఘం చైర్ పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. గతంలో వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపత్యంలో పోలీసులు కట్టదిటట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. డ్రోన్లతోను నిఘా పెట్టారు. కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక కౌన్సిలర్ల మద్దతు ఉంది. చైర్ పర్సన్ అభ్యర్థిగా నార్ల భువన సుందరి వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ పేర్లను టీడిపి ఇప్పటికే ప్రకటించింది.
