
హైదరాబాద్ ఆటగాడు మాత్రం ఇలా తయారయ్యాడు
ప్రస్తుతం ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో చివరి వరకు పోరాడి.. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత సుదీర్ఘ విరామం రావడంతో జట్టు మేనేజ్మెంట్ సూచనల మేరకు హైదరాబాద్ ఆటగాళ్లు మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. రెండు విడతలుగా మాల్దీవులు వెళ్లి.. సరదాగా అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించి వచ్చారు. మాల్దీవులు వెళ్లిన హైదరాబాద్ ఆటగాళ్లల్లో ఓపెనర్ హెడ్ కూడా ఉన్నాడు.. అయితే హెడ్ మాల్దీవులలో చిత్రంగా కనిపించాడు. అక్కడ బీచ్ ప్రాంతంలో గ్లాసులో మద్యం పోసుకుని తాగుతూ కనిపించాడు. బహుశా అది బీర్ అయి ఉంటుందని తెలుస్తోంది. ఇక అతడు ఒంటిపై చొక్కా లేకుండా పడుకొని ఉన్నాడు. ఆ దృశంలో అతడికి పొట్ట పెరిగినట్టు కనిపించింది. సాధారణంగా క్రికెటర్లకు ఆ స్థాయిలో పొట్ట ఉండదు. అలా పొట్ట ఉంటే పరుగులు తీయడం సాధ్యం కాదు. అందువల్లే ప్రస్తుత ఐపిఎల్ లో హెడ్ అంతగా రాణించలేకపోతున్నాడు. హైదరాబాద్ జట్టుకు భారీ ఇన్నింగ్స్ నిర్మించలేకపోతున్నాడు. ” ఓ భయ్యా పొట్టు పొట్టు మందు తాగుతున్నావ్. దానికి తోడు నీకు పొట్ట కూడా విపరీతంగా వచ్చింది. ఇలాంటి వ్యక్తివి ఐపీఎల్ ఎలా ఆడతావు? ఐపీఎల్ లో శరీర సామర్థ్యాన్ని కాపాడుతున్న ఆటగాళ్లే సత్తా చాటుతారు. మరి నువ్వేమో ఇలా తయారయ్యావు. ఇండియాకు వచ్చింది ఐపీఎల్ ఆడేందుకా? ఇలా పొట్ట పెంచి ఇబ్బంది పడేందుకా?” అని సోషల్ మీడియాలో నెటిజన్లు హెడ్ ను ఉద్దేశించి పేర్కొంటున్నారు.