
గ్లోబల్ ఫేమ్ రాబట్టిన ప్రియాంక చోప్రా తండ్రి సైతం సైన్యంలో పని చేశాడు. ప్రియాంక చోప్రా తండ్రి సైన్యంలో డాక్టర్ గా సేవలు అందించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రియాంక చోప్రా SSMB 29లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ దర్శకుడు రాజమౌళి రూ. 1000 కోట్ల బడ్జెట్ తో SSMB 29 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
రకుల్ ప్రీత్ సింగ్ ఆర్మీ నేపథ్యం కలిగిన హీరోయిన్. రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి సైన్యంలో అధికారిక హోదాలో సేవలు అందించాడు. మోడలింగ్ పై మక్కువతో రకుల్ ప్రీత్ సింగ్ నటిగా మారి సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఎక్కువగా హిందీలో చిత్రాలు చేస్తుంది . మరో బాలీవుడ్ నటి నేహా ధూపియా తండ్రి నౌకా దళంలో పని చేశారని సమాచారం. ఈ విషయాన్ని ఆమె కొన్ని సందర్భాల్లో స్వయంగా వివరించింది.
నిమ్రత్ కౌర్ తండ్రి పేరు భూపిందర్ సింగ్. ఈయన ఆర్మీలో మేజర్ గా సేవలు అందించారు. వీరమరణం పొందాడు. ఉగ్రవాదులతో పోరాడుతూ భూపిందర్ సింగ్ కన్నుమూశారు. మిస్ యూనివర్స్ అండ్ స్టార్ లేడీ సుస్మితా సేన్ తండ్రి కూడా ఆర్మీలో పని చేశారు. ఆయన వైమానిక దళంలో పని చేసినట్లు సమాచారం. ఈ విధంగా పలువురు స్టార్ హీరోయిన్స్ తండ్రులు ఆర్మీ అధికారులుగా, వైద్యులుగా దేశానికి సేవలు అందించారు.