
Tollywood Heroine : సినీ నటులు అన్న తర్వాత అన్ని తరహా పాత్రలు చేయాలి. ఒకే వయస్సు లో ఉన్నారు కాబట్టి కేవలం హీరో హీరోయిన్లు గా మాత్రమే నటించాలి అనే రూల్ ఏమి లేదు. తల్లిగా చేయొచ్చు, కోడలిగా చేయొచ్చు, చెల్లిగా కూడా చేయొచ్చు. అప్పట్లో శ్రీదేవి ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, నాగేశ్వర రావు వంటి లెజెండ్స్ కి కూతురుగా చేసింది. మళ్ళీ కొన్నాళ్ల తర్వాత పెద్దయ్యాక వాళ్ళ పక్కన హీరోయిన్ గా కూడా చేసింది. ఇలా ఎన్నో ఉదాహరణలు అప్పట్లో సర్వ సాధారణంగా ఉండేవి. కానీ నేటి తరం లో చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులో ఒక సంఘటన గురించి మీకు వివరించబోతున్నాము. రీసెంట్ గానే ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ హిట్ అందుకున్న ఒక హీరోయిన్, గతం లో నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) కి కోడలిగా చేసింది, అదే హీరోయిన్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సరసన హీరోయిన్ గా కూడా చేసింది.
ఆమె మరెవరో కాదు, ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh). గతం లో నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘టక్ జగదీశ్’ చిత్రం లో నాని కి కోడలిగా నటించింది. ఈ సినిమా అప్పట్లో కరోనా విళయతాండవం చేస్తున్న సమయంలో థియేటర్స్ లో కాకుండా, నేరుగా ఓటీటీ లో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైన ఈ సినిమాకు అప్పట్లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో విడుదల అయ్యుంటే చాలా బాగుండేదని అందరూ అనుకున్నారు కానీ, కుదర్లేదు. అయితే ఇదే హీరోయిన్ విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ లో విజయ్ దేవరకొండ కి భార్య గా నటించింది. రెండు సినిమాల్లోనూ నటన పరంగా ఐశ్వర్య రాజేష్ మంచి మార్కులే కొట్టేసింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈమెకు బాగా కనెక్ట్ అయ్యారు.
ఇకపోతే రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ ఒక హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. తనదైన మార్కు తో ఈ హీరోయిన్ అద్భుతమైన కామెడీ టైమింగ్ ని కనబర్చింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈమె దశ తిరిగిపోతాది. వరుసగా టాలీవుడ్ లో అవకాశాలను సంపాదిస్తుందని అంతా అనుకున్నారు కానీ, ఈమెకు ఆశించిన స్థాయిలో అయితే మన టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదు. ఎక్కువ శాతం ఇప్పటికీ తమిళం లోనే అవకాశాలు వస్తున్నాయి. భవిష్యత్తులో అయినా భారీ ఆఫర్స్ ఈ హీరోయిన్ ఇంటి తలుపు తడుతుందో లేదో చూడాలి. ప్రస్తుతానికి ఈమె నాలుగు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. మధ్యలో కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బుల్లితెర ఆడియన్స్ కి కూడా దగ్గర అవుతుంది.