
తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో తొలి పది ర్యాంకులు బాలురకే వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురికి తొలి మూడు ర్యాంకులు వచ్చాయి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడకు చెందిన పల్లా భరత్ చంద్రకు మొదటి ర్యాంకు వచ్చింది. నంద్యాల జిల్లా కోనాపూరానికి చెందిన ఉడగండ్ల రామ్ చరణ్ రెడ్డికి రెండో ర్యాంక్ వచ్చింది.
వరసగా ర్యాంకులు సాధించి…
మూడో రాంకు విజయనగరం జిల్లా సూర్యకార్తీక్ కు వచ్చింది. నాలుగో ర్యాంకు నాచారానికి చెందిన లక్ష్మీభార్గవ్ కు, ఐదో ర్యాంకు గణేశ్ రాయల్ కు, ఆరో ర్యాంకు రిశాంత్ రెడ్డికి వచ్చాయి. తొలి పది ర్యాంకులు వచ్చిన విద్యార్థులతో పాటు మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.