
తెలంగాణ జూనియర్ కళాశాలల్లో నేడు ప్రవేశానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. ఈరోజు నుంచి మొదటి దశలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడటంతో వెంటనే జూనియర్ కళాశాల్లో మొదటి తరగతి ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు.
అడ్మిషన్ల ప్రక్రియ…
ప్రయివేటు విద్యాసంస్థలతో పోటీ పడేందుకు వెంటనే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించడంతో ఈరోజు నుంచి తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ మే చివర వరకూ స్వీకరిస్తారు.జూన్ రెండో తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30 వ తేదీ వరకూ మొదటి దశ ప్రవేశాల ప్రక్రియ పూర్తి అవుతుంది.