
ఈ నెలలో లభిస్తున్న ఆఫర్ ఇదే
మే 2025లో టాటా టియాగో ఈవీపై కంపెనీ భారీ తగ్గింపును ప్రకటించింది. ఇది ప్రతి ఈవీ కొనుగోలుదారుడికి బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. 2024లో తయారైన మోడల్ మీద మొత్తం రూ.1.3 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. టియాగో ఎలక్ట్రిక్ మీడియం రేంజ్ XE, XT వేరియంట్లపై రూ.50 వేల తగ్గింపు లభిస్తోంది. దీనితో పాటు లాంగ్ రేంజ్ XT వేరియంట్‌పై దాదాపు రూ.65,000 వరకు తగ్గింపు లభిస్తోంది.
ధర, బ్యాటరీ స్పెసిఫికేషన్
టాటా టియాగో ఈవీ ప్రారంభ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది టాప్ మోడల్లో రూ.11.14 లక్షల వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది – 19.2 kWh బ్యాటరీ ప్యాక్ 250 కిమీ రేంజ్ ఇస్తుంది. 24 kWh బ్యాటరీ ప్యాక్ 315 కిమీ వరకు రేంజ్ ఇస్తుంది. దీనిని 15 Amp హోమ్ ఛార్జర్‌తో 15-18 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
ఫీచర్లు, భద్రత
టాటా టియాగో ఈవీలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4-స్పీకర్ హార్మన్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, టీపీఎంఎస్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్లు అందించారు.
లో మెయింటెనెన్స్ ఖర్చు
టాటా మోటర్స్ ప్రకారం.. టియాగో ఈవీ లో మెయింటెనెన్స్ ఖర్చు కేవలం రూ.1.4 ప్రతి కిలోమీటరు మాత్రమే. ఈ లెక్కన చూస్తే బైక్, స్కూటర్ లేదా మెట్రో వంటి వాటితో పోలిస్తే ఇది చౌకైనది. ముఖ్యంగా రోజూ 30-50 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేసే వారికి ఇది చాలా లాభదాయకం.