ముంబై ఉగ్రదాడి కేసులో నిందితుడు తహవర్ హుసేన్ రాణ విచారణకు సహకరించకుండా తప్పించుకున్న రీతిలో సమాధానాలు చెప్పినట్లు తెలుస్తుంది. పోలీసులు దాదాపుఎనిమిది గంటల పాటు విచారించగా ముంబై ఉగ్రదాడలతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాణ పేర్కొన్నట్లు తెలుస్తుంది. అంతేకాక తన ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అనేది చట్టబద్ధమైనదని దానికి ఉగ్రవాద కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. విచారణకు సహకరించకుండా తప్పించుకునే రీతిలో సమాధానాలు ఇస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అనేది రాణకు చెందిన వ్యాపార సంస్థ. తహవర్ రాణ పై త్వరలోనే చార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అమెరికాలోని లాస్ యంజలస్ నుంచి ఇటివల రాణను ఎన్నయ్య బృందం భారత్ కు తీసుకొచ్చింది. అతడిని 18 రోజుల కస్టడీకి అప్పచెబుతూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో ఎన్ఐఏ ముంబై దాడల సూత్రధారులను గుర్తించే పనిని మొదలు పెట్టింది.
