
కరోనా సంక్షోభం అనంతరం కూడా సురేఖావాణికి అవకాశాలు రాలేదు. ఓ మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్న సురేఖావాణి, తన అసహనం వెళ్లగక్కింది. తనకు ఎవరూ ఆఫర్స్ ఇవ్వడం లేదు. ప్రేక్షకులు మాత్రం ఎందుకు సినిమాల్లో కనిపించడం లేదు అంటున్నారు. దర్శక నిర్మాతలు నన్ను పక్కన పెట్టేశారు. నేను ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధం, అని ఆమె అన్నారు. ఆఫర్స్ తగ్గాక సోషల్ మీడియాను నమ్ముకుంది సురేఖావాణి. ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం స్టార్ట్ చేసింది. అనతి కాలంలో ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది.
సురేఖావాణి తన టీనేజ్ డాటర్ సుప్రీతతో వీడియోలు, ఫోటో షూట్స్ చేసేది. వీరిద్దరూ మిత్రుల వలె మెలుగుతారు. పార్టీలు, వెకేషన్స్ కలిసి ఎంజాయ్ చేస్తారు. సురేఖావాణితో పాటు కూతురు సుప్రీత పాప్యులర్ అయ్యింది. సుప్రీతను హీరోయిన్ చేయాలన్న సురేఖావాణి డ్రీం కూడా నెరవేరింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫేమ్ అమర్ దీప్ కి జంటగా సుప్రీత ఓ మూవీ చేస్తుంది. టెలివిజన్ షోలలో సందడి చేస్తుంది.
తాజాగా సురేఖావాణి జన్మదినం జరుపుకుంది. బర్త్ డే వేళ స్లీవ్ లెస్ లాంగ్ కట్ ఫ్రాక్ ధరించి గ్లామర్ షో చేసింది. తనకు బర్త్ డే విషెష్ చెప్పిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపింది. సురేఖావాణి వీడియోపై నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. కొందరు నెటిజెన్స్ మాత్రం అసహనం వ్యక్తం చేశారు. ఈ గ్లామర్ షో సరిపోదు. బర్త్ డే సందర్భంగా బికినీ ఫోటోలు, వీడియోలు కావాలని కామెంట్ చేశారు. నెటిజెన్స్ కొంటె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య సురేఖావాణి రెండో వివాహం చేసుకోనుందని ప్రచారం జరిగింది. పెళ్లి చేసుకొనే ఆలోచన లేదు, హైట్, వెయిట్ తో డబ్బున్న అందమైన వ్యక్తి దొరికితే కలిసి జీవించడానికి సిద్ధం అని ఆమె అన్నారు.