
కోవిడ్ సంక్షోభం రావడంతో ఏడాది పాటు షూటింగ్స్ ఆగిపోయాయి. ఆ విధంగా సురేఖావాణికి గ్యాప్ వచ్చింది. అనంతరం ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో మీడియా ముందు సురేఖావాణి తన వేదన వెళ్లగక్కింది. చాలా మంది సినిమాలు చేయడం లేదు, ఎందుకు? అని అడుగుతున్నారు. నేను చేయడానికి సిద్దంగానే ఉన్నాను. దర్శకులే అవకాశాలు ఇవ్వడం లేదు. దర్శక నిర్మాతలు నన్ను పక్కన పెట్టేశారని సురేఖావాణి ఒకింత అసహనం వ్యక్తం చేసింది.
సినిమాల్లో కనిపించకపోతే జనాలు కూడా మర్చిపోతారు. పాపులారిటీ లేకపోతే సంపాదన ఉండదు. అందుకే తెలివిగా సురేఖావాణి సోషల్ మీడియాను నమ్ముకుంది. గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం స్టార్ట్ చేసింది. తనతో పాటు కూతురు సుప్రీత తన సోషల్ మీడియా పోస్ట్స్ లో ఉండేలా చూసుకుంది. సురేఖావాణి, సుప్రీత కలిసి చేసిన ఫోటో షూట్స్, డాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. అలా సుప్రీత సైతం సోషల్ మీడియా స్టార్ అయ్యింది.
బుల్లితెర ఈవెంట్స్ లో సందడి చేస్తున్న సుప్రీత… బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ కి జంటగా ఓ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు సురేఖావాణి ఇంస్టాగ్రామ్ లో హాట్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ, నెటిజన్స్ గుండెల్లో గుబులురేపుతుంది. సురేఖావాణి తాజాగా బెడ్ రూమ్ వీడియో షేర్ చేసింది. ఈ వీడియో పై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. వయసులో ఉన్నప్పుడే ఇలా ఎక్స్పోజ్ చేసి ఉంటే.. హీరోయిన్ అయ్యేదానివి అని ఒకరు కామెంట్ చేశారు. నీ వయసుకు నువ్వు చేసే గ్లామర్ షోకి సంబంధం ఉందా అని మరొక నెటిజన్ స్పందించాడు. ఇదేమైనా సురేఖావాణి వీడియో వైరల్ కావడంతో ఆమె అకౌంట్ కి రీచ్ పెరుగుతుంది.