
అద్భుతమైన రికార్డు
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ప్లేయర్ (రవిచంద్రన్ అశ్విన్) బౌలింగ్లో 50+ బాల్స్ ఎదుర్కొని.. అత్యధిక స్ట్రైక్ రేట్ (244.44) తో చాటింగ్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో అతడు 54 బంతులు ఎదుర్కొని.. 132 పరుగులు చేశాడు. సునీల్ తర్వాతి స్థానంలో పోలార్డ్ కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో 51 బంతులు ఎదుర్కొని అతడు114 పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 223.52 గా ఉంది. సురేష్ రైనా తర్వాత స్థానంలో ఉన్నాడు. సందీప్ శర్మ బౌలింగ్లో 53 బంతులు ఎదుర్కొని రైనా 110 పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 207.54 గా ఉంది. రైనా తర్వాత డివిలియర్స్ కొనసాగుతున్నాడు. మలింగ బౌలింగ్లో డివిలియర్స్ 61 బంతులు ఎదుర్కొని 124 పరుగులు చేశాడు. ఇతడు స్ట్రైక్ రేట్ 203.27 గా ఉంది. రవిచంద్ర అన్న అశ్విన్ బౌలింగ్ లో ఎప్పుడూ సునీల్ వెనకడుగు వేయలేదు. వెన్ను చూపించలేదు. దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ధాటిగా పరుగులు సాధించాడు. అందువల్లే ఐపిఎల్ లో సునీల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో సునీల్ గొప్పగా బ్యాటింగ్ చేయలేదు. కోల్ కతా జట్టు మేనేజ్మెంట్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ.. అతడు వాటిని నెరవేర్చలేకపోయాడు. చివరికి చెన్నై జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లోను సునీల్ భారీ ఇన్నింగ్స్ నిర్మించలేకపోయాడు. అది ఒక రకంగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు భారీ పరుగులు చేయకపోవడానికి కారణమైంది.